ఆరుగురు సేన యూబీటీ ఎంపీల తిరుగుబాటు,..శివసేన (యూబీటీ)లో మళ్లీ చీలిక కలకలం..

Shiv Sena UBT ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)Shiv Sena UBTలో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. పార్టీ విప్‌ జారీ చేసినప్పటికీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన కీలక సమావేశానికి 9 మంది లోక్‌సభ ఎంపీల్లో కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. దీంతో పార్టీ మరోసారి చీలిక దిశగా వెళుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది…ఢిల్లీకి అర్ధరాత్రి విమాన ప్రయాణాలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో రహస్య సమావేశం, లోక్‌సభ స్పీకర్‌కు లేఖ – ఆరుగురు సేన యూబీటీ ఎంపీల తిరుగుబాటు, ప్రచారానికి దూరంగా, జాగ్రత్తగా సమన్వయం చేయబడిన రీతిలో సాగింది. జూన్ 16న అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే ఉద్ధవ్ థాకరే సేన వర్గంలో రెండవ చీలిక రూపుదిద్దుకోవడం ప్రారంభమైందని వర్గాలు తెలిపాయి. విప్ ఉన్నప్పటికీ, గురువారం జరిగిన కీలక సమావేశానికి పార్టీకి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో కేవలం ముగ్గురు మాత్రమే హాజరు కావడంతో, ఇది ఇప్పుడు దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది …
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గురువారం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి లోక్‌సభ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దీంతో పార్టీ చీలికపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.
ప్రస్తుతం శివసేన యూబీటీకి లోక్‌సభలో 9మంది ఎంపీలు ఉండగా, రాజ్యసభలో సంజయ్ రౌత్ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో గురువారం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు.
అయితే సమావేశానికి సంజయ్ రౌత్‌తో పాటు లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు సమావేశానికి గైర్హాజరయ్యారు.

పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నవారిపై కూడా రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు, కేంద్ర దర్యాప్తు సంస్థల బెదిరింపులతో తమను భయపెట్టలేరని వ్యాఖ్యానించారు. అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లేందుకూ సిద్ధమేనని చెప్పారు. ఆరుగురు ఎంపీల మద్దతుతో ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు కోరుతూ తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను సంప్రదించినట్లు బుధవారం వార్తలు వెలువడ్డాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు పొందాలంటే మూడొంతుల మద్దతు అవసరం. ప్రస్తుతం గైర్హాజరైన ఎంపీల సంఖ్య కూడా ఆ స్థాయిలో ఉండటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

గైర్హాజరైన ఎంపీలకు షోకాజ్ నోటీసులు.

దీంతో గైర్హాజరైన ఎంపీలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఒకవేళ నిర్దిష్ట గడువులోగా స్పందించకపోతే, విప్‌ను ఉల్లంఘించిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరనున్నట్లు అరవింద్ సావంత్ మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉండగా, గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.