శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ మధ్య ఘర్షణ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ యూనియన్‌కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది డ్యాన్సర్లు, మాస్టర్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ అసోసియేషన్‌లో తాజాగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ (శేఖర్ మాస్టర్), జానీ మాస్టర్ (జానీ మాస్టర్) బృందాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అసోసియేషన్ ఎన్నికలు, కొత్త సభ్యత్వాల కేటాయింపు విషయంలో ఇరు వర్గాల మధ్య గతంలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. రాబోయే ఎన్నికల్లో తమ వర్గం పైచేయి సాధించాలనే వ్యూహాలు, అలాగే పంపిణీలలో జరుగుతున్న పరిణామాలు ఈ గొడవకు ప్రధాన కారణమని తెలుస్తోంది…..ఘర్షణ కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా, సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, అసోసియేషన్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాల పైకి కూడా మళ్లింది. సాధారణ సభ్యుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. నిధుల వినియోగం, అంతర్గత కమిటీల నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని ఇరు బృందాల సభ్యులు వాదించుకున్నట్లు సమాచారం. డ్యాన్స్ అసోసియేషన్ జరిగిన ఇరు మాస్టర్ల ముఖ్య అనుచరులు, బృందాల మధ్య ఈ తీవ్ర వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అసోసియేషన్ గత కొన్ని రోజులుగా ఈ గొడవలతో వార్తలతో నిలుస్తోంది. ఇప్పుడు ఏకంగా రణరంగంగా మారింది..

జానీ మాస్టర్ భార్య
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్ కు జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ఆమె ఏకపక్ష నిర్ణయాలపై అసోసియేషన్ మెంబర్లలో తీవ్ర వ్యతిరేకత ఉందని సమాచారం. ఈ మేరకు 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారని కూడా అంటున్నారు.

అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇక ఇప్పుడు ఫెడరేషన్ సభ్యుల్లో మెజారిటీ వాళ్లకు తెలియకుండానే బై ఎలక్షన్ నిర్వహించేందుకు సిద్ధం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని చెప్తున్నారు.

టాప్ కొరియోగ్రాఫర్లు
ఇప్పుడు టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్లుగా సినిమాలకు పని చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా టాప్ స్టార్ల సినిమాలకు కొరియోగ్రాఫీ చేస్తున్నారు. అలాంటి టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య ఈ వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.