ఇండియాలో పెట్రోల్ పరిస్థితులపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ( PCB) మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు.. ముందు మన సంగతి చూసుకో అంటూ షోయబ్ అక్తర్ కౌంటర్….!
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం రాజు కుంటూనే ఉంటుంది. తాజాగా ఇండియాలో పెట్రోల్ పరిస్థితులపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ( PCB) మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం రాజు కుంటూనే ఉంటుంది. తాజాగా ఇండియాలో పెట్రోల్ పరిస్థితులపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ( PCB) మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను పొగుడుతూ, ఇండియా పరువు తీసే ప్రయత్నం చేశాడు మొహ్సిన్ నఖ్వీ. ఐపీఎల్ కోసం డబ్బులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, భారతీయ వాహనదారులను మాత్రం నడిరోడ్డుపైన నిలబెడుతోందని మండిపడ్డారు.
ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ఈ చమురు సమస్య విపరీతంగా ఉంది. ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోడీ సర్కార్ చమురు దిగుమతులను కొనసాగిస్తోంది. అయితే తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును అభిమానులు లేకుండా ఎందుకు నిర్వహిస్తున్నారని ఓ విలేఖరి ప్రశ్నిస్తే, ఇండియాను అవమానించే తరహాలో మాట్లాడారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) . ఇండియాలో పెట్రోల్ కొరత విపరీతంగా ఉందని.. అక్కడి వాహనదారులను మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఇండియా కంటే పాకిస్తాన్ మెరుగ్గా ప్రజలకు చమురు అందిస్తోందని స్పష్టం చేశారు. దీంతో మొహ్సిన్ నఖ్వీని సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు ఇండియన్స్..
ఇండియాలో పెట్రోల్ సమస్య విపరీతంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) చేసిన వ్యాఖ్యలకు తాజాగా షోయబ్ అక్తర్
( Shoaib Akhtar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెట్రోల్ విషయంలో ఇండియా కాలిగోటికి కూడా పాకిస్తాన్ సరిపోదని.. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ప్రేక్షకులతో నిర్వహించేలా చూడు అంటూ మండిపడ్డారు అక్తర్…