సికింద్రాబాద్ బోనాల్లో అపశృతి
సికింద్రాబాద్ బోనాల్లో అపశృతి..
పోలీసుల తీరు: అమ్మవారికి నైవేద్యం తీసుకువస్తుంటే పోలీసులు నెట్టివేశారని ఆరోపణ.బోనాలు పడిపోవడం అపశృతి ఆరోపణలు.
తోపులాటలో పవిత్రమైన బోనాలు కింద పడిపోవడంపై తీవ్ర వేదన.
ప్రభుత్వంపై ఆగ్రహం.
మమ్ములను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపాటు…
జోగినులు సొమ్మసిల్లి పడిపోవడంతో ఉద్రిక్తత
సికింద్రాబాద్ బోనాల వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పోలీసుల తొక్కిసలాటలో కొందరు జోగినులు సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.
ఘటన అనంతరం జోగినులు ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమైన వారు తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మవారికి సమర్పించే బోనాన్ని కింద పడేయడం అత్యంత బాధాకరమని, ఇది ప్రభుత్వానికి, రాష్ట్రానికే అరిష్టమని పేర్కొంటూ జోగినులు శాపనార్థాలు పెట్టారు.
సికిద్రాబాద్ లష్కర్ భోనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆధ్యాత్మికవేత్తగా పేరుగాంచిన జోగిని శ్యామల పండుగరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జోగిని వ్యవస్థ మరియు వారి సంసృతిపై సాంప్రదాయాలపై ప్రస్ధుత సమాజంలో జోగిని సంస్కృతీపై జరుగుతున్న దాడులపై శ్యామల స్పందించారు. మా మాట వినకుండ గత ప్రభుత్వాలు మరియు ఇప్పటి ప్రభుత్వాలు అందరు కలిసి మమ్ములను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు..