బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు…!

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి..

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బీజేపీ.m

ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం..

ఆదేశాలు జారీచేసిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం..

తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు(Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ ఈ పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959