పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘటన పరిశీలించిన జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్..
దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం..
– *ఇతర రాష్ట్రాల నుంచి పనికి కోసం వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నాం.
అనుమానుతుల తనిఖీ చేస్తున్నాం.
జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పరిశ్రమకు భద్రత కల్పిస్తున్నాం.
కార్మికులకు సమస్యలు ఉంటే లేబర్ చట్టాలు పరిశ్రమల చట్టాల ప్రకారం సమరస్యంగా పరిష్కరించుకోవాలి.
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నందు కార్మికులు పోలీసులపై చేసిన దాడి సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. దాడిలో ధ్వంసమైన వాహనాలు, ఫ్యాక్టరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పరిశీలించారు, దాడిలో గాయపడ్డ సిబ్బందిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పాలకీడు మండల పరిధి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నందు కార్మికులు కొంతమంది అక్రమంగా గుమికూడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫ్యాక్టరీ యజమాన్యం ద్వారా పాలకవీడు ఎస్సై కు సమాచారం అందింది దీనిపై స్పందించిన ఎస్సై ఫ్యాక్టరీ వద్దకు తన సిబ్బందితో కలిసి వచ్చి అక్కడ గుమికూడిన 100 నుండి 150 మంది నిర్మాణ పనివారిని గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వినోద్ అనే 48 సం.రాలు అనే కార్మికుడు ఆదివారం రోజున పనికి సెలవు ఉండడంతో క్వార్టర్స్ నందు బట్టలు ఉతికే సమయంలో స్టాక్ వచ్చి పడిపోయాడు ఇతనిని అందుబాటులో ఉన్న సిబ్బంది గమనించి అతనికి మెడికల్ సహాయం అందించి మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడ నందు మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ కు తరలించడం జరిగినది, అక్కడినుండి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతను అప్పటికే మరణించాడు అని నిర్ధారించారు. వినోద్ మృతి పై ఎలాంటి అనుమానం లేదని తోటి కార్మికులు అతని స్నేహితులు తెలపగా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడి నుండి మృతదేహాన్ని యూపీకి తదుపరి కార్యక్రమాల నిమిత్తం పంపించడం జరిగినది. దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు యజమాన్యాన్ని డబ్బులు అడగాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ గుమిగూడగా పోలీసు వారికి సమాచారం అంది రావడం జరిగింది. పోలీసు వారు రాగానే గర్షన్ జరిగి గుంపులోని కొంతమంది అనుమానితులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు ఎస్ఐ కోటేష్ కి, ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్ కి గాయాలయ్యాయి, పోలీస్ వాహనం ఒకటి ధ్వంసమైనది. ఈ ఘటనలో పోలీసు వారిపై దాడికి పాల్పడి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. వీరిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు ఏదైనా సమస్యలు ఉంటే లేబర్ చట్టాల ప్రకారం కార్మిక చట్టాల ప్రకారం పరిశ్రమల చట్టాల ప్రకారం సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప ఎలాంటి దాడులకు పాల్పడకూడదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకారంతో జిల్లాలో పరిశ్రమలను స్వేచ్ఛగా నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ భద్రత కల్పిస్తుందని ఎస్పీ గారు అన్నారు. అనుమానితులపై జిల్లా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు నిఘా ఉంచినదని, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తో తనిఖీలు నిర్వహిస్తుందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే లేబర్, కార్మికుల యొక్క వివరాలు నమోదు చేసుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ నిర్వహణ యజమాన్యం, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రామారావు, కోదాడ రూరల్ CI ప్రతాప్ లింగం, మునగాల CI రామకృష్ణా రెడ్డి, స్థానిక SI కోటేశ్, గరిడేపల్లి ఎస్సై నరేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు..
సేకరణ…
షేక్. మహబూబ్ అలీ