సూర్యాపేట జిల్లా…
హుజూర్నగర్ లో 25వ తారీఖున జరగనున్న మహా జాబ్ మేళా స్థలాన్ని పరిశీలించి,, అనంతరం మఠంపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ వెహికల్ పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ…
పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డ్ పరిశీలన చేసారు..
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..
25వ తారీఖున జరగనున్న జాబ్ మేళా కార్యక్రమానికి ప్రతి యువత తరలివచ్చి ఉపాధి అవకాశాలని అందిపుచ్చుకోవాలని అన్నారు..
ఈ కార్యక్రమం స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుందని అన్నారు..
సుమారు 20వేల మంది తరాలి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు.. ఎంతమంది వచ్చినా కానీ పార్కింగ్ కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా చూసేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు… సుమారు 150 కంపెనీల ప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నట్టు తెలిపారు..
మఠంపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులను తనిఖీ చేయడం జరిగింది..
మఠంపల్లి పోలీస్ స్టేషన్ ఆంధ్ర సరిహద్దుల్లో ఉంది..
ఇసుక,గంజాయి,పిడిఎస్ రైస్ పై కఠినంగా వ్యవహరిస్తున్నాము…
మఠంపల్లి మండలంలో 50 సీసీ కెమెరాలు నిర్మించబోతున్నాము..
వీటి పనులను త్వరగా ముగించుకొని ఏర్పాటు చేయబోతున్నాము…
పోలీసులు పనితీరును ఎప్పటికప్పుడు కేసులను పరిష్కరించాలని సూచించడం జరిగింది..
మఠంపల్లి మండలంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి..
పోలీసులు వెంటనే స్పందించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికీ సఖి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది…
జిల్లాలో క్రైమ్ రేటు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము తగ్గింది..
సీసీ కెమెరాలు ద్వారా ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే వారిని వెంటనే పట్టుకొని కేసు నమోదు చేసే అవకాశం ఉంది..