SSMB 29′ పోస్టర్ షేర్ చేసిన జక్కన్న..

సూపర్‌ స్టార్ మహేష్ బాబు- పాన్ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘SSMB 29’ కోసం యావత్ సినీప్రపంచం ఎదురుచూస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనా, ఇప్పటివరకూ అధికారికంగా మేకర్స్ ఏ ఒక్క అఫ్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో శనివారం మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. ఈ క్రమంలోనే జక్కన్న చిన్న అప్డేట్ షేర్ చేశారు.

మహేశ్ బాబు ప్రీ లుక్ పోస్టర్ను షేర్ చేసుకున్నారు. ఇందులో మహేశ్ చెస్ట్ భాగమే కనిపిస్తుంది. ఛాతి భాగంలో రక్తం, మెడలో ఓ రుద్రాక్ష మాల ధరించినట్లుగా పోస్టర్ కనిపిస్తుంది. మాలలో త్రిశూలం, ఢమరుకం, నంది, శివనామాలతో పోస్టర్ ఆధ్యాత్మికంగానూ కనిపిస్తుంది. ఇప్పటికే అంచనాలు పీక్స్లో ఉన్న ఈ ప్రాజెక్ట్పై తాజా పోస్టర్తో మరింత పెరిగాయి. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

అలాగే ఈ పోస్టర్ ఫుల్ లుక్ అప్డేట్ను నవంబర్లో ఇస్తానని చెప్పారు. అంటే మహేశ్ పోస్టర్ ఫుల్ లుక్ చూడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే. గ్లోబల్ ట్రోటర్ ఫస్ట్ లుక్ ఇన్ నవంబర్ 2025 అని రాసుకొచ్చారు. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ మొదలయ్యాక మేకర్స్ నుంచి వచ్చిన తొలి అధికారిక అప్డేట్ ఇదే. ఈ కాస్త ప్రీ లుక్ పోస్టర్తోనైనా మహేశ్ ఫ్యాన్స్ కాస్త సంతృప్తి చెందినట్లే ఉన్నారు.