ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్…చరిత్రను తిరగరాస్తూ ప్రపంచ కప్ విజేత భారత్…

IND VS NZ Final: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026

చరిత్రను తిరగరాస్తూ ప్రపంచ కప్ విజేత భారత్ ….

ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్..

*తొలిసారి ప్రపంచ కప్ ను సాధించాలని ఆశపడ్డ న్యూజిలాండ్ టార్గెట్ సాధించటం లో బొక్క బోర్లా పడింది*

*దేశ వ్యాప్తంగా పఠాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానులు*

*ఇండియా – 256

*న్యూజిలాండ్*– *159.

అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో భారత్‌ 96 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధిస్తూ.. వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఓవరాల్‌గా మూడు టైటిళ్లు సాధించిన ఏకైక జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. 2007లో ధోనీ, 2024లో రోహిత్‌ నేతృత్వంలోనూ టైటిల్స్‌ దక్కాయి. మరోవైపు కివీస్‌ ఫైనల్స్‌కు వచ్చిన రెండుసార్లు కూడా రన్నర్‌పతో సంతృప్తి పడాల్సి వచ్చింది. అలాగే గతంలో మూడుసార్లు కివీ్‌సపై ఓడిన భారత్‌ ఈసారి గట్టిగానే బదులు తీర్చుకున్నట్టయ్యింది. ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. శాంసన్‌ (46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89), ఇషాన్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), అభిషేక్‌ (21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. దూబే (8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. నీషమ్‌కు మూడు వికెట్లు లభించాయి. ఛేదనలో కివీస్‌ 19 ఓవర్లలో 159 పరుగులు చేసి చిత్తయ్యింది. సైఫర్ట్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52), శాంట్నర్‌ (35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మాత్రమే రాణించారు. బుమ్రాకు 4, అక్షర్‌కు 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బుమ్రా, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా శాంసన్‌ నిలిచాడు..

అద‌ర‌గొట్టిన‌ బుమ్రా..

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే 256 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో, న్యూజిలాండ్ ఆటగాళ్లకు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన బూమ్ బూమ్ బుమ్రా నాలుగు వికెట్ పడగొట్టాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు జస్‌ప్రీత్ బుమ్రా. ఈ దెబ్బకు న్యూజిలాండ్ కుప్పకూలింది. అటు అక్షర్ పటేల్ మొదట్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శ‌ర్మ‌, వరుణ్ చక్రవర్తి అలాగే హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. ఈ దెబ్బ‌కు 19 ఓవ‌ర్లు ఆడిన న్యూజిలాండ్, 159 ప‌రుగులు చేసింది ఆలౌట్ అయింది. దీంతో భార‌త దేశ వ్యాప్తంగా సంబ‌రాలు మొద‌ల‌య్యాయి..

టైటిల్ గెల్చుకున్న టీమిండియా కు ఐసీసీ నుంచి భారీ స్థాయిలో ప్రైజ్ మనీ ( T20 WORLD CUP 2026 PRIZE MONEY ) దక్కనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం విశ్వ విజేత టీమిండియా కు ఐసీసీ ద్వారా 27.50 కోట్లు దక్కనున్నాయి. అలాగే ఇండియా చేతిలో ఫైనల్ లో ఓడిపోయిన రన్నరప్ జట్టు న్యూజిలాండ్ కు 13.67 కోట్లు వస్తాయి. సెమీఫైనల్స్ దాకా వచ్చి ఓటమి చెందిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లకు చెరో 7.24 కోట్లు దక్కనున్నాయి. ఇక సూపర్ ఎనిమిది దశలో నిలిచిన జట్లకు 3.48 కోట్లు దక్కుతాయి. గ్రూప్ స్టేజీల్లో ఎలిమినేట్ అయిన జట్లకు 2.29 కోట్లు దక్కుతాయి. పాకిస్తాన్ జట్టుకు 3.48 కోట్లు రానున్నాయి.