మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల..!

మెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.

_• 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ప్రపంచకప్. భారత్ శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు. అహ్మదాబాద్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. టీ20 వరల్డ్ కప్ లో ఆడనున్న 20 దేశాల టీమ్‌లు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్‌లుగా మొత్తం నాలుగు గ్రూపులు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు టీమ్‌లు సూపర్ – 8కి అర్హత. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ – పాక్ మ్యాచ్..

టీ20 ప్రపంచ కప్-2026 టోర్నమెంట్ లో భారత్‌(India), శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా(Australia), న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్టులు భాగం కానున్నాయి. ఇక ప్రపంచ కప్ మ్యాచ్‌లు భారత్‌లోని 5 స్టేడియాల్లో (అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి), శ్రీలంక(Srilanka)లోని 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది…