డీలిమిటేషన్ డాక్యుమెంట్లను తగలబెట్టిన ముఖ్యమంత్రి స్టాలిన్..

దక్షిణాది రాష్ట్రాలు తమ పోరును ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి స్టాలిన్ తగులబెట్టారు. ఇకపై తమ పోరును కంటిన్యూ చేస్తామని చెప్పకనే ఆయన చెప్పారు.. గురువారం పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్-డీలిమిటేషన్ బిల్లులు వచ్చాయి. దీన్ని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమకు నష్టం జరుగుతుందని చెబుతున్నాయి. అయినా సరే కేంద్రం ముందుకు వెళ్లడాన్ని తూర్పార బట్టాయి. దీన్ని నిరసిస్తూ చెన్నైలో ఆందోళనకు దిగింది అధికార డీఎంకె ప్రభుత్వం.

నల్ల దుస్తులు ధరించిన ఆ పార్టీ నేతలు తన నిరసనను కేంద్రానికి తెలిపారు. చెన్నైలో గురువారం ఉదయం సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ డాక్యుమెంట్లను తగులబెట్టారు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతిఘటన జ్వాల గతంలో ఢిల్లీని దహించి వేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టి మరో జ్వాలను రగిలించినట్లు ఆయన ప్రస్తావించారు…