తమిళనాడులో పెట్టుబడి వివరాలు ఆంధ్రప్రదేశ్‌కు లీక్ అయ్యాయా?… 15 మంది అధికారులను తొలగించిన విజయ్ సర్కార్..
తమిళనాడులో పలు కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు ప్రాజెక్టులు ఆంధ్రాకు తరలిపోవడంతో ఇది మరింత బలపడింది. దీనిపై దర్యాప్తు చేసిన తమిళనాడు ప్రభుత్వం 15 మంది సీనియర్ అధికారులను తొలగించింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి ఇది దారి తీసింది. (Tamil Nadu investments leaked to Andhra) తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్ట్మెంట్ విధానానికి సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్‌కు లీకైనట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట తమిళనాడులో పెట్టుబడులకు ముందుకు వచ్చిన కొన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి..తమిళనాడు’ ఆ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రభుత్వ విభాగంలో చాలా కాలంగా పని చేస్తున్న సీనియర్ అధికారులు కీలకమైన పెట్టుబడుల రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు వచ్చిన కంపెనీల వివరాలను ఆంధ్రా ప్రభుత్వానికి వారు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు తర్వాత 15 మంది సీనియర్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం తొలగించింది. తొలగించిన సీనియర్ అధికారుల్లో చాలా మంది 2016 నుంచి 2021 వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీరు తమ పదవుల్లో కొనసాగారు.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వం తొలగించిన అధికారులలో ముగ్గురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. తమిళనాడులో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రయత్నాలను దెబ్బతీయడానికి పెద్ద కుట్ర జరిగిందా? పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన నేతృత్వంలోని శాఖను లక్ష్యంగా చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ వివాదంపై స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన విమర్శించారు, దశాబ్దాలుగా నిర్మితమైన ఒక సంస్థను రాజకీయ వివాదంలోకి ప్రభుత్వం లాగుతోందని ఆయన ఆరోపించారు. ‘తమిళనాడుకు చెందిన అత్యుత్తమ మేధావుల కృషి ఫలితంగా ఏర్పడిన ఒక సంస్థను, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అపరిపక్వమైన, సోషల్ మీడియా ఆధారిత రాజకీయాల ద్వారా దెబ్బతీయడం చాలా బాధాకరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
అలాగే కొంతమంది ఉద్యోగులు సంస్థను వీడటం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం దెబ్బతింటుందనే ప్రభుత్వ వాదనను కూడా టీఆర్బీ రాజా ప్రశ్నించారు. ‘తమిళనాడు పెట్టుబడుల వ్యవస్థ, పారిశ్రామిక వాతావరణం అంత బలహీనంగా ఉన్నాయని ఈ ప్రభుత్వం భావిస్తోందా?’ అని ఆయన నిలదీశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ కూడా ఈ ఆరోపణలను ఖండించింది..
ముఖ్యంగా, మూడు దక్షిణ కొరియా కంపెనీల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,614 కోట్ల విలువైన పెట్టుబడులను తమిళనాడు కోల్పోవడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ తరుణంలో తాజా విషయాలు వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే… సహజంగానే పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు వారి పాలసీలకు అనుగుణంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటారు.
అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం… పెట్టుబడులకు సంబంధించిన డేటా లీక్ ఆరోపణలకు గైడెన్స్ తమిళనాడుకు చెందిన 15 మంది అధికారులను తొలగించిందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే… రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో గైడెన్స్ తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలోనే జోసెఫ్ విజయ్ ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడులకు సంబంధించిన రహస్య సమాచారం నిజంగానే ఆంధ్రప్రదేశ్‌కు చేరిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, తమిళనాడు పెట్టుబడుల ప్రోత్సాహక ప్రయత్నాలను దెబ్బతీసేందుకు ఈ ఘటన జరిగిందా?, పరిశ్రమల శాఖ మంత్రి కీర్తనను ఎవరైనా లక్ష్యంగా చేసుకున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
విజయ్ సర్కార్‌పై డీఎంకే ఫైర్…
ఈ వివాదంపై స్పందించిన డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా… టీవీకే ప్రభుత్వం వ్యవహార శైలిని విమర్శించారు. దశాబ్దాలుగా నిర్మించిన ఒక వ్యవస్థను ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి లాగుతోందని ఆయన ఆరోపించారు. తమిళనాడులోని అత్యుత్తమ మేధావులచే నిర్మించబడిన ఒక వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అపరిపక్వమైన, సోషల్ మీడియా ఆధారిత రాజకీయాల వల్ల దెబ్బతీయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
కొంతమంది ఉద్యోగులు వెళ్లిపోవడం వల్ల రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం చెబుతుండటాన్ని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు పెట్టుబడుల వ్యవస్థ, పారిశ్రామిక వాతావరణం అంత బలహీనంగా ఉన్నాయని ఈ ప్రభుత్వం భావిస్తోందా? అని నిలదీశారు. వెళ్లిపోయిన అధికారులలో చాలామంది 2016-2021 మధ్య అన్నాడీఎంకే హయాంలో నియమితులైనవారని… అయితే 2021లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు వారిని తొలగించలేదని పేర్కొన్నారు. తాము అనుభవానికి విలువ ఇచ్చామని… వ్యక్తులను గౌరవించామని చెప్పారు. ప్రభుత్వం తన సొంత సంస్థను బలహీనపరుస్తూ, ఆ నిందను గత డీఎంకే ప్రభుత్వంపై మోపుతోందని ఆయన ఆరోపించారు.
తమిళనాడు నుంచి పెట్టుబడులను ఎవరూ అంత సులభంగా తీసివేయలేరు. కానీ అసమర్థమైన, అభద్రతా భావంతో కూడిన, సున్నితత్వం లేని నిర్ణయాలు వాటిని ఖచ్చితంగా దూరం చేస్తాయి. సంస్థలకు రాజకీయ నాటకాలు కాకుండా నాయకత్వం అవసరం’’ అని టీఆర్బీ రాజా చెప్పుకొచ్చారు.
ఖండించిన ఏపీ సర్కార్
తమిళనాడు నుంచి రహస్య పెట్టుబడి సంబంధిత సమాచారాన్ని పొందడంలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల ద్వారానే పెట్టుబడులను ఆకర్షిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారని ఇండియా టూడే రిపోర్టు చేసింది. పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్‌కు తనదైన విధానం ఉందని, పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల పెట్టుబడి విధానాలు లేదా వ్యూహాలను అనుకరించడంపై తమ రాష్ట్రం ఆధారపడి ఉందనే ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.
సుమంత్ కనుకుల టైమ్స్ నౌ వార్తలులో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను అందిస్తున్నాడు. అతనికి జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో అతను వివిధ ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేశాడు.