తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల…!

తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో వివిధ జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం..

99.30 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ములుగు జిల్లా

89.23 శాతంతో అతి తక్కువ ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లా…..

బాలికలదే పైచేయి….

తెలంగాణ తాజా టెన్త్ ఫలితాలల్లో బాలికలదే పైచేయి. వీళ్ల ఉత్తీర్ణథ 96.26 శాతంగా ఉంది. ఇక బాలుర ఉత్తీర్ణత 94.07 శాతంగా నమోదు..

తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. 2026 ఎస్ఎస్‌సీ ఫలితాలను ఈరోజు ఏప్రిల్ 29 మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకుంటున్నారు..

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు:

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి కింది వెబ్‌సైట్లలో మార్కుల మెమోను చెక్ చేసుకోవచ్చు:

♦ bse.telangana.gov.in

♦ results.bse.telangana.gov.in

♦ results.bsetelangana.org

♦ school.edu.telangana.gov.in

మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

పైన పేర్కొన్న ఏదైనా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

♦ హోమ్ పేజీలో కనిపించే ‘TG SSC Result 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.

♦ మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.

♦ సబ్మిట్ బటన్ నొక్కగానే మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

♦ భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.

ప్రత్యామ్నాయ మార్గాలు (SMS & వాట్సాప్):

భారీ ట్రాఫిక్ వల్ల వెబ్‌సైట్లు ఓపెన్ కాకపోతే, విద్యార్థులు డిజిలాకర్, SMS మరియు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.

వాట్సాప్ విధానం: 8096958096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, సూచనల ప్రకారం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.