అసెంబ్లీలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..

అసెంబ్లీలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాలపై హౌజ్ కమిటీ వేయాలని నినాదాలు..

వెల్ లోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నెట్టివేసిన మార్షల్స్..

బీఆర్ఎస్ నిరసనల మధ్యే మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మైనింగ్పై విచారణకు ఆదేశించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు?. బీఆర్ఎ స్ దగ్గర ఆధారాలుంటే సీఐడీకి ఇవ్వొచ్చని శ్రీధర్ బాబు అన్నారు..
అంతకుముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్పై చర్యలు తీసుకోవాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సభలో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది.