కేసీఆర్ సభకు వస్తే సాగునీటిపై చర్చ..!
తామూ చర్చకు సిద్ధంగానే ఉన్నామన్న కేటీఆర్, హరీశ్
సభను హుందాగా నడుపుతాం: మంత్రి శ్రీధర్‌బాబు
సర్కార్ వైఫల్యాల్ని ఎండగడతాం: బీజేపీఎల్పీ నేత ఏలేటి
నేటి సభలో మొదట డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను సాగునీటి అంశం వేడెక్కించనుంది. ఇప్పటికే రాజకీయం కాకరేపుతున్న నదీజలాలే ప్రధాన అంశంగా నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరగనుంది. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, శాసన మండలిలో మాజీ ఎమ్మెల్సీలు మాధవరం జగపతి రావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సంతాపం ప్రకటిస్తారు..
గెజిట్ ప్రచురణలకు చట్టబద్ధత : జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన రెండు ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్సులకు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు..
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలాకాలం తర్వాత సభకు వచ్చే అవకాశం ఉండటంతో సాగునీటి అంశాన్ని లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ‘అధికార పార్టీ తోలు తీస్తాం. సాగునీటి విషయంలో నిజాలు నిగ్గు తేలుస్తాం’ అంటూ బచావత్ ట్రిబ్యునల్ అంశాన్ని లేవనెత్తారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నీళ్ల కేటాయింపులపై అన్ని విషయాలు చర్చిద్దామని సవాల్ విసిరారు. దీంతో సమావేశాల్లో కూడా వాడివేడి చర్చ తప్పదని భావిస్తున్నారు…
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ : ఈ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డీపీఆర్‌ను(సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు) కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపించగా, ఈ వ్యవహారం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. గులాబీ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెనక్కి వచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంపై సభలో వాడీవేడి చర్చలు జరిగే అవకాశాలున్నాయి..
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959