దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు మరో షాక్..ఇండిగో దేశీయ మార్కెట్ వాటా 63.6 శాతానికి పడిపోయింది..!
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు మరో షాక్ తగిలింది. నవంబరులో ఇండిగో దేశీయ మార్కెట్ వాటా 63.6 శాతానికి పడిపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. ఈ నెల (డిసెంబరు) ప్రారంభంలో ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
డీజీసీఏ తాజా డేటా ప్రకారం
ఎయిర్ ఇండియా గ్రూప్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ), స్పైస్ జెట్ దేశీయ మార్కెట్ వాటా నవంబరులో వరుసగా 26.7 శాతం, 3.7 శాతానికి పెరిగింది. అక్టోబర్ లో ఈ రెండు సంస్థలు దేశీయ మార్కెట్ వాటా వరుసగా 25.7 శాతం, 2.6 శాతంగా ఉంది. అయితే ఈ రెండు సంస్థలు నవంబర్లో కాస్త వృద్ధిని నమోదు చేశాయి. ఆకాసా ఎయిర్ దేశీయ మార్కెట్ వాటా కూడా నవంబర్లో 4.7 శాతానికి పడిపోయింది. అక్టోబర్లో ఆ సంస్థ దేశీయ మార్కెట్ వాటా 5.2 శాతంగా ఉంది.
ఈ ఏడాది నవంబర్లో 63.6 శాతం దేశీయ మార్కెట్ వాటాతో ఇండిగో అతిపెద్ద దేశీయ క్యారియర్గా కొనసాగింది. కానీ అక్టోబర్లో దేశీయ మార్కెట్ వాటాతో (65.6 శాతం)తో పోలిస్తే నవంబరులో కాస్త దెబ్బతింది. కాగా, నిర్వహణలో అంతరాయాల నేపథ్యంలో డిసెంబరు ప్రారంభంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగోను దాని శీతాకాలపు షెడ్యూల్ ను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది..”2025 జనవరి-నవంబర్ వరకు దేశీయ విమానయాన సంస్థల్లో 15,26,35,000 మంది ప్రయాణించారు. గతేడాది ఇదే కాలంలో 1,4,64,0002 మంది ప్రయాణించారు. తద్వారా వార్షిక వృద్ధి 4.26 శాతంగా ఉంది. నెలవారీ వృద్ధి 6.92 శాతంగా నమోదైంది. గత నెలలో విమానయాన సంస్థలు 1,196 ప్రయాణీకులకు సంబంధించిన ఫిర్యాదులను అందుకున్నాయి. వాటిలో 50.6 శాతం విమాన సమస్యకు సంబంధించినవి. లగేజ్ (17.9 శాతం), వాపసు (12.5 శాతం)కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. షెడ్యూల్ చేసిన దేశీయ విమానయాన సంస్థల మొత్తం రద్దు రేటు నవంబర్లో 1.33 శాతంగా ఉంది” అని డీజీసీఏ తెలిపింది.
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959