తెలంగాణలో ఆగస్టు 15 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ…

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల నూతన ల్యామినేటెడ్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
కొత్త ల్యామినేటెడ్ రేషన్ కార్డులతో లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతమైన, మన్నికైన కార్డులు అందుబాటులోకి రానున్నాయి…
తెలంగాణలో రేషన్ కార్డులు ఆన్ లైన్ లో అలాట్ అయినప్పటికీ.. ఫిజికల్ గా చాలా మందికి ఇంకా కార్డులు రాలేదు. అయితే కొందరు ఆన్ లైన్ కార్డుల మీద రేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే మొత్తం కోటి ఐదు లక్షల మందికి ఫిజికల్ గా.. స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది. ఆగస్టు 15న అన్ని నియోజకర్గాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.