తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా..

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా
Telangana Cabinet Meeting.
ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకుండా ఢిల్లీలోనే ఉండటంతో వాయిదా

ఇవాళ జరగవలసిన క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయం

OBC సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి

ఢిల్లీలోనే ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీని సోమవారానికి వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం..
Telangana Cabinet Meeting