తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
సీఎం రేవంత్ రెడ్డికి ఏడుసార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం..
కనీసం ప్రియాంక గాంధీ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదట..!
మూసి ఆధునీకరణ అంటూ, నిర్మాణాల కోలగొట్టడంలో వ్యతిరేకిస్తున్న సీనియర్లు..!
జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడని తెలిపారు. దాదాపు ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డికి హాలిడే పీరియడ్ ముగిసిందన్నారు. త్వరలో సీఎం పోస్ట్ ఖాళీ కానుందన్నారు. సీఎం పదవికి ఆశావాహులు పోటీ పుడతున్నారని చెప్పారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తుందన్నారు. రేవంత్ కు రాహుల్ గాంధీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. మూసి ప్రాజెక్టు వ్యయాన్ని 50 వేల కోట్ల వ్యయాన్ని లక్షన్నర కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు. ఇందులో భారీగా స్కాం జరగబోతుందని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని దూరం పెట్టిందన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని.. ఎదురుతిరుగుతున్నారని చెప్పారు. బయటకు చెప్పలేని వాళ్ల చెవులు కొరుకుంటున్నారని .. కొందరు గ్రూపులు కడుతున్నారని.. మరికొందరు ఏకపక్ష దోరణిని వ్యతిరేకిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు..
రేవంత్ పై ఫిర్యాదు..
2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త సీఎం రావచ్చని బాంబు పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కొత్త సీఎం వేటలో పడిందన్నారు. మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నారు. ఈ విషయంపై మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్ మంత్రులు రేవంత్ పై హై కమాండ్ కు ఫిర్యాదు చేశారన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులకు మూసి ప్రక్షాళన ఇష్టం లేదన్నారు. సీఎం రేవంత్ నిర్ణయాలను సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు..