తెలంగాణలో మొత్తం 230 మంది పాకిస్థానీయులు ఉన్నారు
వీరిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయి.. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు
మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారిని గుర్తిస్తున్నాం
లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు.. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది
మిగిలిన వారు రేపు తిరిగి వెళ్లిపోవాలి.. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్లిపోవచ్చు..
లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. హెల్త్ బేస్ పై వీసాలు తీసుకున్నవారికి ఈ నెల 29వ తేదీ వరకు ఉండేందుకు సమయం ఉందని తెలిపారు. మిగిలిన వారు రేపు వెళ్లిపోవాలని చెప్పారు. షార్ట్ టర్మ్ వీసాలతో వచ్చి తిరిగి వెళ్లని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తామని అన్నారు. అంతేకాకుండా కర్రెగుట్టలో మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లో తెలంగాణ పోలీసులు పాల్గొనలేదని స్పష్టం చేశారు…