గద్దర్ అవార్డ్స్’లో సీఎం రేవంత్ ముందు ‘పుష్ప 2′ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్…గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే’..!.
గద్దర్ అవార్డుల ప్రదానోత్సం హైదరాబాద్ లోని హైటెక్స్ లో శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో జరుగుతున్న అవార్డుల కార్యక్రమం ఇది గద్దర్ సినీ అవార్డుల(Telangana Gaddar Awards) ప్రదానోత్సవంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బెస్ట్ యాక్టర్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాకుండా.. ఈ సందర్భంగా పుష్ప-2 సినిమాలోని డైలాగ్ను సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్తో అల్లు అర్జున్ చెప్పారు. ‘ఆ బిడ్డ మీద ఒక్క గీత పడినా.. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్పారు. దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. కాగా, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో సినీ తారలు రావడంతో హైటెక్స్ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. అల్లు అర్జున్తో పాటు విజయ్ దేవరకొండ, సుకుమార్, రాజమౌలి, నాగ్అశ్విన్ హాజరయ్యారు..
సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరీ…’గద్దర్ అవార్డ్స్’లో ‘పుష్ప 2’ డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్.
‘పుష్ప 2 ది రూల్’లో నటనకు గాను ఉత్తమ కథానాయకుడిగా బన్నీని అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత…
రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ కలవడం ఇదే!
‘పుష్ప 2 ది రూల్’ ప్రీమియర్ షోను అభిమానులతో కలసి చూసేందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్లడం, ఆయన వచ్చిన సమయంలో అభిమానులు ఎగబడిన కారణంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందడం, ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి రావడం అందరికీ తెలిసిన విషయాలే.
‘పుష్ప 2’ ప్రెస్మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు బన్నీని అరెస్ట్ చేయించారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. తెలంగాణ అసెంబ్లీలో సైతం అరెస్టు గురించి చర్చ జరిగింది. చట్టం ముందు అందరూ సమానమేనని రేవంత్ రెడ్డి తన చర్యల్లో చూపించారు. అయితే… అల్లు అర్జున్ మీద తనకు ఏ విధమైన ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఆ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ కలవడం ఇదే మొదటిసారి.
రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. దాని కంటే ముందు, వేదిక మీదకు రావడానికి ముందు ఇద్దరు కింద కలిశారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముందుగా వచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ పక్కన కూర్చున్నారు. రేవంత్ రెడ్డి రాగానే అల్లు అర్జున్ లేచి ఆయనకు నమస్కారం చేశారు. ఆ వెంటనే బన్నీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు రేవంత్. తర్వాత వేదికపై మరొకసారి ఇద్దరు కలిసి సందడి చేశారు. దాంతో తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు గాని, దూరం గాని లేవని పరోక్షంగా చెప్పినట్లు అయింది.
రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని మరీ…
ఉత్తమ కథానాయకుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్… తనకు ఈ పురస్కారం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సినిమా వేడుక కనుక ఒక డైలాగ్ చెబుతానంటూ వేదికపై ఉన్న రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని ‘పుష్ప 2’ సినిమాలో ‘ఆ బిడ్డ మీద చెయ్యి పడితే రప్పా రప్పా నరుకుతా’ అని అభిమానులు విజిల్స్ వేసేలా తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. తనకు లభించిన అవార్డును ఏఏ ఆర్మీ(అల్లు అర్జున్ అభిమానులకు)కి అంకితం చేశారు…