ఆస్తి కోసం తోడబుట్టిన వారితో కొట్లాడి ఏం సాధిస్తారు…తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

ఆస్తి కోసం తోడబుట్టిన వారితో కొట్లాడి ఏం సాధిస్తారు ???

*- తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు*

* తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా కోరకుండా ఉండే చట్టం తెస్తే బాగుంటుంది
* 44 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కుటుంబం, విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
* 264 గజాల స్థలం కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన ఆరుగురు కుటుంబసభ్యులు (తల్లిదండ్రులతో కలిపి)
* విచారణ సమయంలో ఒక్కో మనిషికి 44 గజాల స్థలం వస్తుందని, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకోలేరు కదా అని ప్రశ్నించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి
* మాకు అధికారం ఉండుంటే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం తెచ్చే వాళ్లమని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.