తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు బిగ్ షాక్…కింగ్ ఫిషర్ బీర్ బంద్..!

తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజస్కు కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాల సరఫరాను నిలిపివేయాలని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలిపింది.

Telangana Kingfisher Beers.

ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.

కారణం ఇదే

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ మేరకు సెబీకి లేఖ ద్వారా తెలిపింది. 2019-20 నుంచి బీర్ల ధరలను సవరించకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ పేర్కొంది..