సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ..

పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..? కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా అని మండిపడ్డారు. ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దు నిద్ర.. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ లేఖ

పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..? కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా అని మండిపడ్డారు.
పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..? కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా అని మండిపడ్డారు. ధాన్యం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణ మృదంగమేంటని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడు.. రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారని హెచ్చరించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు.