మహబూబ్నగర్ రైతు పండగ సభ ముగింపు సందర్భంగా
ఆయా రుణాలను ప్రభుత్వం విడుదల చేయనుంది..

రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు
మహబూబ్నగర్లో ‘రైతు పండగ’ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల
హైదరాబాద్,.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతులకేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి .ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
శుక్రవారం మహబూబ్నగర్లో జరిగిన రైతు పండుగ (రైతు పండుగ) కార్యక్రమంలో ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు, విజయాలను గురించి మాట్లాడటం జరిగింది…..
కాంగ్రెస్ర్ పార్టి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రైతులందరికీ రుణమాఫీ చేయడం ఇదో రికార్డుగా చెబుతున్నారు అని అన్నారు…
ఒక్క ఏడాదిలో రైతులకు దాదాపు 54 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది తమ సర్కార్. అందులో రైతు పెట్టుబడి సహాయం కింద 7,625 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 10,444 కోట్లు ఉన్నాయి.
ఇక ధాన్యం కొనుగోలు కోసం 10, 547 కోట్ల రూపాయలు, వరదల వల్ల పంట నష్టం కింద ఎకరాకి 10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసింది. తెలంగాణలో 42 లక్షల మంది రైతులకు భీమా కవరేజ్ నిమిత్తం 1433 కోట్ల రూపాయలను ప్రీమియం కింద చెల్లింపు చేసింది.
ఇవికాకుండా పచ్చి రొట్టె ఎరువు తయారీ, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు చెల్లింపులు, మార్క్ ఫెడ్ ద్వారా ధాన్యం సేకరణ, వ్యవసాయ సంబంధిత నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, హార్టికల్చర్, ఆయిల్ పామ్ సాగు సబ్సిడీ, వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రజా ప్రభుత్వం.