ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన…

ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన.

అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం పడే అవకాశం.

కామారెడ్డి, మెదక్‌లో కుండపోత వర్షాలు.

రంగారెడ్డి, వికారాబాద్‌లో భారీ వర్షాలు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీైంది. అర్ధరాత్రి తర్వాత పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం లేకపోతే రాత్రి వేళ బయటకు వెళ్లకుండా ఉండాలని, వాగులు, వంకలు, చెరువుల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..