కవిత TRS పార్టీ పేరుపై 600కుపైగా అభ్యంతరాలు..!
తెలంగాణ..
కవిత పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన Telangana Raksha Sena (టీఆర్ఎస్)(TRS)’ పేరు వివాదంలో చిక్కుకుంది. బీఆర్ఎస్తో పాటు పలువురు వ్యక్తులు కేంద్ర ఎన్నికల సంఘానికి 600కుపైగా అభ్యంతరాలు తెలిపారు. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో ముడిపడిన ‘టీఆర్ఎస్’ పేరును బీఆర్ఎస్ (BRS) గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గుర్తిస్తున్నందున, ఆ పేరును వేరే వారికి కేటాయించరాదని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రకు చెందిన దయానంద్ మహాదేవ్ మాండ్యాల్ కూడా కవిత KAVITA పార్టీ పేరు ప్రకటనకు ముందే ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ పేరుకు దరఖాస్తు చేసుకున్నానని, కాబట్టి ఆ పేరును కవితకు ఇవ్వొద్దని కోరారు. ఇప్పటికే ‘తెలంగాణ రాజ్యసమితి’Telangana Raksha Sena కూడా కవిత పార్టీపై ఫిర్యాదు చేసింది. దీంతో కవిత పార్టీ పేరుపై సందిగ్ధం నెలకొంది..