దారుణం చోటుచేసుకుంది. అత్యంత ఘోరం జరిగిపోయింది. ఇందులో భాగంగా… హర్యాణాలోని ఓ టెన్నిస్ క్రీడాకారిణి హత్యకు గురైంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే…
ఆమె కన్న తండ్రే ఆమెను కాల్చి చంపాడు. ఈ సమయంలో సుమారు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అవును… హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25) గురుగ్రామ్ నివాసముంటుంది. ఈ సమయంలో ఆమె తండ్రి దీపక్ యాదవ్ వెనుక నుంచి వచ్చి ఆమెపై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో రాధిక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురుగ్రామ్ లో రాధికా యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో రాధిక గురువారం ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి వెనుక నుంచి వచ్చి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ సమయంలో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది!.
Tennis Player Radhika Yadav Murdered by Father in Gurgaon Shocking …
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అయితే… హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అయితే కన్న కూతురిపై ఎందుకు కాల్పులు జరిపారనే దానిపై విచారిస్తున్నట్లు తెలిపారు!
అయితే… రాధిక తండ్రి రీల్స్ చేయడంలో ఆమె కున్న ఆసక్తి చూసి కలత చెందాడని, అది కుటుంబానికి అవమానం కలిగిస్తుందని భయపడ్డాడని పోలీసు వర్గాలు తెలిపాయంటూ జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ కారణంగా గత 15 రోజులుగా తాను ఒత్తిడిలో ఉన్నానని, అందుకే చివరికి అలాంటి చర్య తీసుకున్నానని చెప్పినట్లు చెబుతున్నారు.
ఇది మరో రకం వాదన..
కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? అది ఓ బతుకేనా ఇలాంటి సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. ఏకంగా కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైన వార్త సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. తమ నివాసంలోనే ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, కొద్ది కాలం క్రితం జరిగిన టెన్నీస్ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కృంగి పోయింది. అయితే తనలాగా టెన్నీస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు టెన్నీస్ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్‌తో రాధికా యాదవ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రికి కూడా చేదోడు వాదోడుగా నిలిచింది..అయితే దీపక్ యాదవ్ కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు. రాధిక టెన్నిస్ అకాడమీ ఆదాయంపై దీపక్ ఆధారపడి జీవిస్తున్నాడని ఎగతాళి చేసేవారట. ఈ అవమానమే అతడి కోపాన్ని పెంచింది. రాధిక తన టెన్నిస్ అకాడమీని మూసివేయాలని తండ్రి కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. తన కుమార్తె కెరీర్, సంపాదనపై సమాజం నుంచి వస్తున్న విమర్శల కారణంగా కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు..