డొనాల్డ్ ట్రంప్ కలల బిల్లు “బిగ్ బ్యూటిఫుల్” జులై 4న ఆమోదం పొందాక భారత్ పై ఆ చట్టం రూల్స్ ను ప్రయోగించింది ట్రంప్ సర్కార్..భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, టూరిస్ట్లకు బిగ్ షాక్ ఇచ్చింది. వీసా ఫీజును భారీగా పెంచేసింది. ఇప్పటివరకూ రూ. 16,000 ఉన్న ఫీజును రూ. 40,000 లకు పెంచింది. దీంతో అమెరికా వెళ్లాలని కలలు కన్న భారత విద్యార్థులు, టూరిస్ట్ లకు ఆర్థిక భారం తప్పేలా లేదు.
ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో విదేశీయులకు బిగ్ షాక్ తగిలింది. అమెరికా వీసా దరఖాస్తు ఫీజును సవరించింది. ఈ బిల్లు రూల్స్ ను అమలు చేస్తూ వీసా ఫీజులను అమాంతం పెంచేసింది. ఇప్పటివరకూ రూ. 16,000 ఉన్న వీసా ఫీజును రూ. 40,000లకు పెంచింది. ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’ అనే పేరుతో కొత్త మోసానికి తెర తీసింది అమెరికా. ఇప్పటివరకూ ఉన్న ఫీజుకు అదనంగా 250 డాలర్ల ఫీజును విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాక ఏటా అమెరికాలోని ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గుల ప్రకారం వీసా ఫీజులు మారనున్నాయి. ఇక ఈ వీసా ఫీజు నాన్- రిఫండబుల్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వడం కుదరదు. ఈ నిర్ణయంతో అమెరికా వెళ్లాలని కలలు కన్న భారత విద్యార్థులు, టూరిస్ట్ లకు ఆర్థిక భారం తప్పేలా లేదు. దీనికి తోడు భారత్ కు డబ్బు పంపే వారిపై ఒక్క శాతం రిమిటెన్స్ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా విధించనున్నారు.
ఈ వీసా ఫీజులు నాన్- ఇమ్మిగ్రెంట్ వీసాలు, బీ-1 లేదా బీ-2( టూరిస్టు అండ్ బిజినెస్) వీసాలు, ఎఫ్ అండ్ ఎమ్ స్టూడెంట్ వీసాలు, హెచ్1- బీ( వర్క్ వీసాలు) అండ్ జే(ఎక్స్ ఛేంజ్ విజిటర్ వీసాలు) వర్తించనున్నాయి. కేవలం డిప్లొమాటిక్ వీసా దారుల్లో ఏ కేటగిరీ, జీ కేటగిరీ వాళ్లకు మాత్రం మినహాయింపు ఉంది.