టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు శుభవార్త..

టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీజీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ జోన్ కి సంబంధించి 63 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీసీ. వివిధ హోదాల్లో ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది…వివిధ విభాగాల్లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఉన్నత హోదాలు కల్పిస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు గత కొన్ని నెలలుగా ఉద్యోగుల సంక్షేమం కోసం అమలు చేసిన ఇతర ప్రధాన నిర్ణయాలు క్రింది విధంగా ఉన్నాయి…

జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) – 28 మంది..

పదోన్నతి పొందిన వారిలో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లుఇద్దరు ఆఫీసర్లు (RCs) ఉన్నట్లు తెలిపింది ఆర్టీసీ.

జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్) – 27 మంది.

పదోన్నతి పొందినవారిలో 27 మంది కండక్టర్లు ఉన్నారు.

ఈ పదోన్నతుల కోసం మే 25, 2025న నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ రాత పరీక్షతో పాటు, జులై 27, 2025న నిర్వహించిన కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లో అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపింది.

డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 8 మంది.

పదోన్నతి పొందిన వారిలో డిపో కంట్రోలర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు నుంచి మొత్తం 8 మందికి డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) హోదాలో పదోన్నతులు కల్పించినట్లు తెలిపింది ఆర్టీసీ.

ఈ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్ పదోన్నతులు పొందిన ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ, వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి సంస్థ ప్రతిష్టను పెంపొందించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుశ్రో షా ఖాన్ మాట్లాడుతూ.. పదోన్నతులు పొందిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల ప్రతిభ, అర్హతలకు తగిన గుర్తింపునిస్తూ పదోన్నతులు కల్పించడం ద్వారా సిబ్బందిలో మరింత ఉత్సాహం, పని పట్ల నిబద్ధత పెరుగుతాయని ఈడీ ఖుశ్రో షా ఖాన్ పేర్కొన్నారు.