ఫైనాన్స్ క్లియర్ చేయకుంటే మాత్రం ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన సరే వాయిదా పడాల్సిందే. అఖండ 2 వాయిదా నేపథ్యంలో టాలీవుడ్ లో మరొక న్యూస్ తెరపైకి వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అవడం లేదని బాలీవుడ్ సంస్థకు రాజాసాబ్ మేకర్స్ అయిన పీపుల్స్ మీడియా క్లియర్ చేయాల్సిన ఫైన్సాస్ పెండింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి…
విడుదలకు సిద్ధమైన సినిమాలు కొన్ని గంటల ముందు వాయిదా పడుతుండటం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా ఎంతోమందిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. ఇప్పుడు మా సినిమా ‘ది రాజాసాబ్’ రిలీజ్పై కూడా రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేం ఇప్పటికే క్లియర్ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం. ‘అఖండ 2’తోపాటు డిసెంబరులో విడుదల కానున్న చిత్రాలు, 2026 సంక్రాంతికి రానున్న ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘జన నాయగన్’, ‘పరాశక్తి’ తదితర సినిమాల కోసం ఎదురుచూస్తున్నా. అన్నీ చిత్రాలు మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా‘ అని విశ్వ ప్రసాద్ ఆకాంక్షించారు…
రాజాసాబ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్..
రాజాసాబ్ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్న నేపధ్యంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ‘ సినిమా విడుదలకు చివరి నిమిషంలో అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండించాలి. రాజాసాబ్ మేకింగ్ కు తీసుకున్న ఫైనాన్స్ కు సంబంధించిన నిధులను పూర్తిగా క్లియర్ చేస్తాము. అలాగే వడ్డీలును కూడా అనుకున్న దాని కంటే ముందుగానే క్లియర్ చేస్తాం. మా రాజాసాబ్ తో పాటు వస్తున్న మన శంకర వర ప్రసాద్, భర్త మహాశయుకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, జన నాయగన్, పరా శక్తి మరియ ఇతర సంక్రాంతి రిలీజ్లు ఎటువంటి రిలీజ్ లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ కావాలి. అలాగే అన్ని సినిమాలు ఘనవిజయం సాధించాలి అని ట్వీట్ చేశారు…