ఆర్మీ జవాన్‌ను పోల్‌కు కట్టేసి కర్రలతో దాడిచేసిన టోల్‌ సిబ్బంది…జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్‌ను ధ్వంసం చేసిన స్థానికులు..!

ఉ త్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మేరఠ్ సమీపంలోని టోల్‌గేట్ వద్ద చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది..
రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను రక్షించాల్సిన సమాజమే వారిపై దాడికి దిగడం తగదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సైనికులపై జరిగే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

NHAI ఏ చర్యలు తీసుకుంది?

టోల్‌గేట్‌పై రూ.20 లక్షల జరిమానా విధించింది. అలాగే భవిష్యత్తులో ఏ బిడ్డింగ్‌లోనూ పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేలా చర్యలు చేపడుతోంది..
అయితే, రద్దీ కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనం మీరట్‌లోని భూని టోల్‌గేట్‌ ( Bhuni toll plaza) వద్ద చిక్కుకుపోయింది. ఫ్లైట్‌కు టైమ్‌ అవుతుండటంతో.. కపిల్‌ కారు దిగి ఆలస్యంపై టోల్‌ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ క్రమంలో కపిల్‌, టోల్‌ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన టోల్‌ సిబ్బంది జవానుపై దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దాడి దృష్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు సమాచారం అందుకున్న మీరట్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జవాను కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీడియో ఆధారంగా నలుగురు టోల్‌ సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సిబ్బంది దాడిలో ఆర్మీ జవాన్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు..

https://x.com/TeluguScribe/status/1957318090829541795?t=fdsWlKjOhocJ26LWSJgxCA&s=19
జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్‌ను ధ్వంసం చేసిన స్థానికులు…
తరవాత
https://x.com/TeluguScribe/status/1957663255687754195?t=5BRqB5XDjcj6vGiUBVm4GA&s=19.

వీడియోలో నలుగురు సిబ్బంది ఆర్మీ జవాన్‌ను కారులో నుంచి బయటకు లాగి కర్రలతో దాడి చేస్తూ.. అతడిని బలవంతంగా అక్కడ ఉన్న స్తంభానికి కట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీడియో ఆధారంగా నలుగురు టోల్‌గేట్‌ సిబ్బందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు…