రేపటి నుంచి జూన్ 2 వరకు గ్రామాల్లో పర్యటించాలి: సీఎం
తెలంగాణలో రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం.. మన పథకం, మన పేటెంట్, మన బ్రాండ్ అని కొనియాడారు. భూ భారతి పోర్టల్ను రైతులకు చేరవేయాలని సూచించారు…..
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే నేను కూడా సమయం కేటాయిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేంవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వున్న ప్రజలందరికి పాలణ పరమైన ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం సీరియస్ అయ్యారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. సన్నబియ్యం పథకం ఒక అద్భుతం అని అన్నారు. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం అని రేవంత్ రెడ్డి అన్నారు..
రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని అన్నారు. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని అన్నారు. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది అని అన్నారు. మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని రేవంత్ రెడ్డి అన్నారు…
ఎమ్మెల్యేల తీరు పై సీఎం సీరియస్ ..అయ్యారు. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తో రావాలని ఆదేశించిన సీఎం అదేశించారు. సంవత్సరం పొడవునా చేసిన పార్టీ ఆక్టివిటీస్ రిపోర్ట్ తో వచ్చిన ఎమ్మెల్యేలు. మరింత స్పీడ్ గా పర్ఫార్మెన్స్ ఉండాలని స్ట్రిక్ట్ వార్ణినింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పదవులు రావని అలా మాట్లాడితే ఇక్కడ పదవులు వస్తాయి అనుకుంటే మీకే నష్టం. పదవులు ఇచ్చేది అధిష్టానం అధిష్టానం ఫైనల్ ఇష్టా రీతిలో మాట్లాడితే ఎక్కువ నష్టం మీకేఅని, పార్టీ లైన్ దాటి ఎవరు కామెంట్స్ చెయ్యొద్దని రేవంత్ రెడ్డి సీరియస్ వార్ణింగ్ ఇచ్చాడు.