లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు..

లిక్కర్‌ దందాలు చేసే కవితకు త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్‌ గాంధీ పేరెత్తే నైతిక అర్హత లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ మీద పడి దొంగల ముఠా మాదిరి దోచుకుందని.. దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌ కేసీఆర్‌ కుటుంబమని ధ్వజమెత్తారు. అగ్రనేత రాహుల్‌ ఆలోచన మేరకే కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ‘లిక్కర్‌ దందాలతో కవిత దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఆమె రౌడీ కాబట్టే.. బహిరంగంగానే రౌడీనని చెప్పుకొంటున్నారు. అసలు రజతోత్సవ సభ బీఆర్‌ఎస్‌ కోసమా? టీఆర్‌ఎస్‌ కోసమా? వారికే స్పష్టత లేదు.’’ అని అన్నారు..