టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు మాజీ మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో అసత్య.. నిరాధార ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు మాజీ మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించారు…మహేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు..హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు..ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు కూడా హాజరై సహకరించామని గుర్తుచేశారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని మజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదని కొట్టిపారేశారు. రేవంత్‌ రెడ్డి, మహేశ్‌ కుమార్‌ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయంగా పబ్బం కడుక్కునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ వంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కకు నెట్టాలని కేటీఆర్ హితవు పలికారు…