ప్రధాని నరేంద్ మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్..

ప్రధాని నరేంద్ మోడీకి అగ్ర రాజ్య అధ్యక్షుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. తన స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. తాను ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపానన్నారు. ఆయన అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మోదీ మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ . కాగా ట్రంప్‌ కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ ఎక్స్లో లో పోస్ట్ పెట్టారు. అధ్యక్షుడు ట్రంప్ తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ కాల్లో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారన్నారు. అందుకు తన మిత్రుడికి ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌ లాగే తానూ కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నానన్నారు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలకు భారత్‌ మద్దతు ఇస్తుందని మోడీ ఎక్స్ లో లో పోస్ట్ చేశారు..జూన్‌ 17 తర్వాత ట్రంప్, మోడీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్‌ తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్‌ అక్కసు వెళ్లగ్గారు. ఈ క్రమంలోనే భారత్‌ పై 50శాతం టారిఫ్‌ విధించారు. మరోవైపు భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ అనేకసార్లు ఖండించింది. అయినా ఏదొక సమయంలో ఈ ప్రస్తావనను తీసుకొస్తునే ఉన్నారు…