మొంథా తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉంటుంది…

మొంథా తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను రేపు ఉదయం తీవ్ర తుఫాన్‌గా మారుతుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌ రావు తెలిపారు. తీవ్ర తుపానుగా మారి సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌ రావుతో తెలిపేరు..
మరోవైపు ఈ తీవ్రత మరో 18 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సముద్రానికి ఆనుకొని ఉండే కోస్తాంధ్ర ప్రాంతానికి తుపాను ముప్పు ఎక్కువగా ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం విశాఖ, విజయవాడ, నెల్లూరు వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. అటు విమాన సర్వీసులను కూడా రద్దు చేసారు. పరిస్థితులు కుదట పడేదాకా రైల్లు, విమాన సర్వీసులు నడపకూడదని ప్రభుత్వానికి వాతావరణ శాఖ తెలిపింది. అప్పట్లో వచ్చిన ‘హుద్ హుద్’ తుపాను అత్యంత భారీగా మొంథా తుపాను ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువ ఉండే ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్లకు ఆహారం, నీళ్లతో పాటు దుప్పట్లు, పారిశుద్ధానికి సంబంధించిన పనులపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు..

మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ : రేపు రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు తెలంగాణలోని ఈశాన్య జిల్లాలకు ఈ మొంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ జారీ చేశామని, ఇక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు…

ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి ఈ వేగం మరింత పెరుగుతుంది. అయితే ఈ తుపాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర, యానంలో 30వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు…