తమిళనాడు రాజకీయ వేదికపై విమర్శల స్థాయి, మాటల పదును రోజురోజుకూ కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. కావేరీ నీటి పంపకాల వివాదంపై తంజావూరులో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది..ఒక మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి ఆయన అసభ్యకర, డబుల్ మీనింగ్ పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ తమిళగ వెట్రి కజగం పార్టీ ఏకంగా జాతీయ మహిళా కమిషన్ తలుపు తట్టింది.
కావేరీ డెల్టా రైతుల హక్కుల కోసం డిఎంకె నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. కాగా, ఈ సభలో శ్రేణులు చేసిన నినాదాలకు సమాధానమిస్తూ ఉదయనిధి చేసిన ప్రసంగం సాధారణ రాజకీయ విమర్శల సరిహద్దులను దాటిందని టివికె పేర్కొంది. రాజకీయంలో విమర్శలు సహజమే అయినప్పటికీ, మహిళా నేతల వ్యక్తిగత ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా ప్రసంగించడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది.