అభిమానికి లిప్ కిస్ ఇచ్చిన సింగర్.. నెటిజన్స్ ఆగ్రహం.. !

Udit Narayan:

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఇటీవల ఓ షోలో తన అభిమానికి లిప్ కిస్ ఇవ్వడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో ఉదిత్ నారాయణ్ 90’s లో ఫేమస్ అయిన టిప్ టిప్ బార్సా పాటను పాడి అలరించారు.

ఓ అభిమాని సెల్ఫీ దిగిందేకు ప్రయత్నించింది. అదే సయమంలో ఊహించని విధంగా మహిళా అభిమాని అతడికి కిస్ ఇచ్చాడు. దీంతో ఉదిత్ నారాయణ్ సైతం ఆమెకు లిప్ కిస్ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట క్షణాల్లో వైరలయ్యింది. దీంతో ఉదిత్ నారాయణ్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మహిళా అభిమానితో ఇలా ప్రవర్తించింది ఉదిత్ నారాయణేనా? పబ్లిక్‌లో ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారా అని పలువురు ప్రశ్నించారు.

Udit Narayan Kisses Female Fan:: మహిళా అభిమానికి …

తాజాగా ఈ ఘటన పై ఉదిత్ నారాయణ సైతం స్పందించాడు. ఈ వివాదంపై ఉదిత్ నారాయణ్ ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ చెప్పుకొచ్చారు.

నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. సమాజంలో నాకు మంచి పేరు ఉంది. మహిళా అభిమానులతో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు లేదు. కొందరు కావాలనే దీనిని వివాదం చేస్తున్నారు’ అని అన్నారు..