టీ-20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..!

టీమిండియా అండర్ 19 మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి అండర్ 19 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమ్‌గా నిలిచింది..ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా టీమ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. మన బౌలర్ల దాటికి సౌతాఫ్రికా ప్లేయర్లు ఒక్కరు కూడా సరిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. సఫారీ జట్టు 44 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు..

మ్యాచ్ సాగింది ఇలా…

బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మహిళా జట్టుపై భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మైకే వాన్ వూర్ట్స్ (23), జెమ్మా బోథా (16), ఫే కౌలింగ్ (15), వికెట్ కీపర్ కారాబో మెసో (10) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

సిమోన్ లారెన్స్ (0), డయారా రామ్లాకన్ (3), కెప్టెన్ కైలా రేనేకే (7), షెష్ని నాయుడు (0), అష్లి వాన్ వైక్ (0), మోనాలిసా లెగోడీ (0), న్తాబి సెంగ్ నిని (2) పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో 20 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 82 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. భారత స్టార్ ఆల్ రౌండర్, తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించింది.

తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లను పడగొట్టింది. ఇక వైష్ణవి శర్మ,, ఆయుషి శుక్ల, పరిణికా సిసోడియ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షబ్నమ్ ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం అనంతరం 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు నాలుగవ ఓవర్ మూడవ బంతి వద్ద వికెట్ కీపర్ జి.కమలిని (8) వికెట్ ని కోల్పోయింది.