తెలంగాణ, APల్లో ఉపాధి హామీ వేతనం ఎంతంటే?.

*🔹

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని రూ.307గా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంకావడానికి ముందు ఈ వేతనాలను సవరిస్తూ వస్తోంది. అందులో భాగంగానే 2025-26 సంవత్సరానికి ఈ కొత్త వేతనాలను ప్రకటించింది. 2024-25తో పోలిస్తే రూ.7 ఎక్కువగా పెంచింది. దేశంలో అత్యధికంగా హర్యానాలో రోజువారీ వేతనాన్ని రూ.400గా నిర్ణయించారు.