*అరటి పండుతో యూరిక్ యాసిడ్స్ చెక్*
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. అలాగే కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అరటిపండుతో యూరిక్ యాసిడ్కు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి ప్యూరిన్ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందట. దీంతో యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు…అంతే కాదు యూరిక్ యాసిడ్ సమస్య వల్ల గుండెపోటు సమస్య కూడా రావచ్చు. అందువల్ల యూరిక్ యాసిడ్ సమస్య రాకూడదనుకుంటే ఆహారం విషయంలో తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి.దీని కోసం తప్పనిసరిగా పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి.