అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల అధీనంలో ఉన్న కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్లు పాగా వేశారు. రిపబ్లికన్ల కంచుకోటలుగా చెప్పుకునే ఒహాయో, అయోవా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయ ఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఇటు అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయమే మిగిలింది. ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ధరలు, ట్రంప్ నాయకత్వంపై అమెరికన్ ఓటర్ల అసంతృప్తిని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ట్రంప్ తిక్క నిర్ణయాలకు అమెరికన్ ప్రజలు గట్టి బుద్దిచెప్పారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది…గత 20 ఏళ్లుగా ఒహాయో ,అయోవా రాష్ట్రాల ప్రజలు డెమోక్రటిక్ గవర్నర్లను ఎన్నుకోలేదు.1998 నుంచి జార్జియాను రిపబ్లికన్ పార్టీ ఏలుతోంది. ఇక 1990 నుంచి టెక్సాస్ లో ఒక్క డెమోక్రటిక్ ను కూడా గవర్నర్ గా ఎన్నుకోలేదు. తాజాగా డెమోక్రాట్లు సాధించిన ఈ తిరుగులేని విజయాలు..ట్రంప్‌కు ఓ చెంపపెట్టుగా మారాయి. ఎందుకంటే మధ్యంతర ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీపై ఆయన ప్రభావమే ఎక్కువగా ఉంది. దీంతోపాటు దేశంలో ఆర్థిక ఆందోళనలు, ఓటర్ల అసంతృప్తి, మారుతున్న రాజకీయ ప్రాధాన్యతలు రాబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా ఎన్నికల స్వరూపాన్ని పునర్నిర్మిస్తున్నాయని కూడా ఈ ఫలితాలు సూచిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
2026 నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు అనూహ్య విజయాలు సాధించారు. తాజా లెక్కల ప్రకారం సెనేట్‌లో 100 స్థానాలకు గాను 53 స్థానాలను గెలుచుకున్నారు. ప్రతినిధుల సభలోనూ మెజారిటీకి అవసరమైన 218 స్థానాల మార్కును దాటి 220 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో రెండు సభల్లోనూ డెమోక్రాట్లకు ఆధిపత్యం లభించింది. టెక్సాస్, కాన్సాస్, సౌత్ కరోలినా వంటి సంప్రదాయ రిపబ్లికన్ ఆధిపత్య రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు విజయాలు సాధించడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతగా నిలిచింది. నార్త్ కరోలినా, ఒహాయో రాష్ట్రాల్లోనూ సెనేట్ స్థానాలను గెలుచుకున్నారు (Donald Trump Veto)….2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections 2026) డెమొక్రాటిక్ పార్టీ చారిత్రక విజయాన్ని నమోదు చేస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చింది..
రిపబ్లికన్ల కంచుకోటలుగా ఉన్న పలు కీలక రాష్ట్రాలలో డెమొక్రాట్లు చారిత్రాత్మక విజయాలు సాధించారు…
ఎన్బీసీ న్యూస్ అంచనాల ప్రకారం, 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు 256 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా, 100 మంది సభ్యులున్న సెనెట్‌లో కనీసం 54 స్థానాలు దక్కించుకుని స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. ధరలు తగ్గిస్తానని, ప్రజల జీవితాలను సులభతరం చేస్తానని 2024 ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్, ఆ తర్వాత ఆ హామీలను పక్కనపెట్టారు. అమెరికాను గొప్పగా మార్చేందుకు టారిఫ్‌లు విధించడం, ఇరాన్లో ప్రభుత్వ మార్పు కోసం యుద్ధానికి దిగడం, వైట్‌హౌస్ సుందరీకరణ వంటి భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇవే ఆయన పట్ల ప్రజాగ్రహానికి కారణమయ్యాయి.
రిపబ్లికన్లకు కంచుకోటలైన టెక్సాస్, కాన్సాస్, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలుకావడం ఆయన అంచనాలను తీవ్రంగా దెబ్బతీసింది. కాన్సాస్‌లో 95 ఏళ్ల రిపబ్లికన్ల గుత్తాధిపత్యానికి తెరదించుతూ డెమోక్రాట్ అభ్యర్థి ఆడమ్ హామిల్టన్ సెనెటర్‌గా గెలిచారు. టెక్సాస్ గవర్నర్‌గా హినా హినోజోసా ఎన్నికవడంతో 36 ఏళ్ల రిపబ్లికన్ పాలనకు ముగింపు పడింది. ట్రంప్ స్వయంగా ఎంపిక చేసిన అభ్యర్థులు సైతం ఓడిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ.
ఈ ఓటమితో పార్టీపై ట్రంప్ పట్టు సడలుతుందని, ఆయనను వ్యతిరేకించే వారి సంఖ్య పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధ్యక్షుడిగా మిగిలిన రెండేళ్లలో ఆయన దూకుడుకు కళ్లెం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితాల తర్వాత ‘పొలిటికో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “రెండేళ్ల పాటు ప్రతీదాన్నీ వీటో చేస్తూ కూర్చోవాలని నేను అనుకోవడం లేదు. దేశానికి మంచి జరిగేలా చూసేందుకు డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తాం” అని తెలిపారు.
అయితే, డెమోక్రాట్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతినిధుల సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న హకీమ్ జెఫ్రీస్ మాట్లాడుతూ, “మేము కీలకమైన మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడున్న వ్యవస్థలు సరిగా లేవు. అమెరికా ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్ కావాలి” అని స్పష్టం చేశారు. దీంతో రాబోయే రెండేళ్లలో ట్రంప్ పాలన ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.