అమెరికాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి.!

అమెరికాలో లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటుండగా ఓ కారు దూసుకురావడంతో 10 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. దుండగుడు కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం… బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవర్ కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది..బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ట్రక్ డ్రైవర్‌ పాల్పడ్డ ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రజలు న్యూఇయర్‌ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో వారిపైకి ట్రక్కు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ దాడి తర్వాత డ్రైవర్‌పై పోలీసులు కాల్పులు జరిపే ప్రయత్నం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు..కొన్ని రోజుల క్రితం జర్మనీలోనూ ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు నగరమైన మాగ్డేబర్గ్‌లో డిసెంబర్ 20న ఈ దాడి జరిగింది. సౌదీ మూలాలున్న ఓ వ్యక్తి ఈ దాడి చేశాడని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడికి మానసిక వ్యాధి ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనను మరవక ముందే ఇప్పుడు అమెరికాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం..