వెలుగులోకి వాగ్దేవిల్యాబ్ ఓనర్ శ్రీనివాస్ అక్రమాలు.
మరొకరి లైసెన్స్‌పై శ్రీనివాస్ డ్రగ్స్ దందా
డైరెక్టర్ ఫ్యాక్టరీస్ అనుమతి లేకుండానే..
వాగ్దేవి ల్యాబ్ నడిపిస్తున్న శ్రీనివాస్ ఓలేటి
నాచారంయూనిట్ లైసెన్స్ రెన్యువల్ కాలేదన్న అధికారులు..
దువ్వూరి సుబ్రహ్మణ్యం లైసెన్స్‌తో డ్రగ్స్ దందా..
లైసెన్స్ విషయంలో ఇప్పటికే నడుస్తున్న కోర్టు కేసు..2022లో లైసెన్స్ రెన్యువల్‌కు అంగీకరించని పీసీబీ..
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా అరెస్టుతో సంచలనం రేగింది. పేరుకు (Vagdevi Labs) లాబొరేటరీ అని చెప్పుకుంటూ నడుస్తున్న ఫ్యాక్టరీలో, లోపల మాత్రం అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ఘోర విషయం వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉన్న ఓ కెమికల్ (Vagdevi Labs) ఫ్యాక్టరీ ‘వాగ్దేవి ల్యాబ్స్’ పేరుతో నకిలీ లైసెన్స్ ఆధారంగా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో అధునాతన పరికరాలతో ఎండీ (మెఫెడ్రోన్) అనే నిషేధిత డ్రగ్స్ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని దర్యాప్తులో తేలింది..
లైసెన్స్ విషయంలో ఇప్పటికే నడుస్తున్న కోర్టు కేసు..2022లో లైసెన్స్ రెన్యువల్‌కు అంగీకరించని పీసీబీ..