సినీ ఇండస్ట్రీలో వారసుల రాక సులువే అయినా, నిలదొక్కుకోవడం మాత్రం వారి సొంత ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. కోలీవుడ్ దిగ్గజ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌కుమార్.. గ్లామర్ పాత్రలకే కాకుండా ఒక పవర్‌హౌస్ పెర్ఫార్మర్గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆమె నటిగానే కాకుండా దర్శకురాలిగానూ మెగాఫోన్ పట్టి తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు..
కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి..
వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సరస్వతి’ (Saraswathi). హై కాన్సెప్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మీతో పాటు ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు ( ఫిబ్రవరి 21న ) ఈమూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై వరలక్ష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు గోపీచంద్ మలినేనిని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపీ సర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. నా స్నేహితుడు, మెంటర్. ఒక దశలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న నాకు ‘క్రాక్’ సినిమాతో తెలుగులో సెకండ్ లైఫ్ ఇచ్చారు. నాపై నమ్మకం ఉంచి ‘జయమ్మ’ పాత్రను ఇచ్చిన ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఎమోషనల్ అయ్యారు.