ఒంటి నిండా బొబ్బలతో చిన్నారికి వింత వ్యాధి..!

ఏదో వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఒక చిన్నారికి శరీరమంతా బొబ్బలు, తీవ్రమైన దురదతో కూడిన వింత వ్యాధి సోకడం స్థానికులను, అధికారులు కలవర పడుతున్నారు. చిన్నారికి ఈ వింత వ్యాధి వచ్చిందన్న ప్రచారం జిల్లాలో ఆందోళన కలిగించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా అధికారులు వెంటనే స్పందించి.. ఆ చిన్నారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం చిన్నారిలో ఇన్ఫెక్షన్ తగ్గిందని వైద్యులు తెలిపారు.

విచిత్రమైన వ్యాధి..

అయితే.. ఈ వ్యాధి ఎలా సోకిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఇంకెవరికైనా సోకిందా, లేక అక్కడికే పరిమితమైందా అనే కోణంలో గ్రామంలో అంతర్గత సర్వే కూడా నిర్వహిస్తున్నారు. సమాచారం మేరకు.. ఆ చిన్నారి ఖమ్మం జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఖమ్మం జిల్లాతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం వల్లే ఇలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు..చిన్నారికి సోకిన ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందకుండా.. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు పెనుగంచిప్రోలు ప్రజలకు సూచించారు. ఇందులో భాగంగా.. పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ పౌడర్తో శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఈ వింత వ్యాధి వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు.. ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.

చిన్నారికి ఇన్ఫెక్షన్ రావడంపై ఉన్నతాధికారుల ఆరా తీశారు. విజయవాడ GGHకి తరలించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తున్నారు.. గ్రామంలో ఇంకా ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందేమోనని పరిశీలిస్తున్నారు.

చిన్నారికి సోకిన ఇన్ఫెక్షన్‌పై ఆందోళన చెందవద్దని అధికారుల సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని పెనుగంచిప్రోలు ప్రజలను కోరారు. దీనిలో భాగంగా పారిశుధ్య సిబ్బంది.. బ్లిచింగ్ పౌడర్ తో శానిటైజేషన్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఖమ్మం జిల్లా గార్లలో జరిగిన ఫంక్షన్‌కి వెళ్లివచ్చాక చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని బంధువులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అపోహలు నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారుల సూచించారు…