విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం..

విశాఖపట్నం

విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) విభాగంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన వేడి ద్రవ ఉక్కును తరలిస్తున్న క్రేన్ లాడెల్ ఒక్కసారిగా తెగి కిందపడటంతో అక్కడ విధుల్లో ఉన్న తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు.

వందల టన్నుల ద్రవ ఉక్కు నేలపై ఒలికిపోవడంతో విపరీతమైన వేడిగాలికి పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు దట్టమైన పొగను పీల్చడం వల్ల కొందరు కార్మికులు స్పృహ తప్పి కింద పడిపోయారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని దేవుని కోరుకుంటున్నాను అని చెప్పారు..

మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఎక్స్ గ్రేసియా ప్రకటించారు.

ల్యాడిల్ కుప్పకూలడంతో ముంచెత్తిన ఉక్కు ద్రవం
స్టీల్ మెల్టింగ్ షాప్-2 విభాగంలో కన్వేయర్ సహాయంతో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన మరుగుతున్న ఉక్కు ద్రవం (హాట్ మెటల్) ల్యాడిల్స్‌ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో ల్యాడిల్స్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో, అందులోని ద్రవం అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పడింది. తీవ్రమైన వేడి కారణంగా ఎనిమిది మంది కార్మికులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, సమీపంలో ఉన్న మరికొందరు తీవ్ర అగ్ని గాయాలపాలయ్యారు…ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్లాంట్ అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను రక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫైర్ ఫైటర్లు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఊహించని ప్రమాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ప్రమాదం జరగడానికి గల ఖచ్చితమైన కారణాలపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు…