విజయవాడ: కృష్ణలంక Nagaraju సీఐ నాగరాజుపై మరోసారి తీవ్ర ఆరోపణలు…
సాయికృష్ణ Sai Krishna లాకప్ డెత్ నేపథ్యంలో మరో యువకుడి మృతి కలకలం…
కృష్ణలంక సీఐ నాగరాజు CI Nagaraju వేధింపుల వల్లే క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ…
పీఎస్ కు రమ్మన్న వెంటనే పురుగులమందు తాగిన క్రాంతికుమార్…
తన చావుకు కారణం కృష్ణలంక సీఐ నాగరాజేనని సెల్ఫీ వీడియో…సీఐ నాగరాజు కారణం అనే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మూడు నెలలుగా సీఐ నాగరాజు తనను వెంటాడి వేటాడి కొడుతున్నాడని.. సీఐ నాగరాజు దెబ్బలకు తట్టుకోలేకపోతున్నానని.. తన చావుకు కృష్ణలంక సీఐ నాగరాజు కారణం అంటూ సెల్ఫీ వీడియో తీశాడు క్రాంతికుమార్ KRANTI KUMAR.
ఆ వీడియోలోనే అతను పొలాల్లో పంటలకు ఉపయోగించే గుళికల మందు తినటం.. ఆ వెంటనే నీళ్లు తాగటం కనిపించింది. తాను మాదిగ కులానికి చెందిన వ్యక్తిని అని.. అందుకే తనను 3 నెలలుగా రోజూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొడుతున్నాడని క్రాంతికుమార్ ఈ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు.
విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు ఏపీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒక కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను జూన్ 29వ తేదీలోపు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
గాదె సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని.. సాయికృష్ణ డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని.. ఆధారాలు లేకుండా చేశారని.. బూడిద కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సాయికృష్ణ తల్లి కూడా మీడియా ముందుకొచ్చి తన కొడుకును కాల్చేసి ఉంటే బూడిదైనా ఇవ్వాలని కన్నీరుమున్నీరయింది.