నల్లగొండ జిల్లా:..
మిర్యాలగూడ మండలం, గూడూరు లో.. సీఎం “రేవంత్ రెడ్డి” మాట్లాడుతూ….
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు…
గత రెండేళ్లలో.. అన్నివర్గాల ప్రజలంకోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టింది…
మా రెండేళ్ల పాలన చూసి ఓటేయాలని పట్టణ ప్రజలకు పిలుపు…
గత 10 ఏళ్ల BRS పాలనలో.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు…
ఆనాడు దొడ్డు బియ్యం మిల్లులకు అమ్ముకొని, గేదెలకు పెట్టారు…
కాంగ్రెస్ పాలనలో పేదలకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
-ఆసియాలో ఎక్కువ వరి పంట పండిస్తోంది.. మిల్లింగ్ చేస్తుంది..
-గత BRS పాలనలో.. వరి వేస్తే ఉరి అన్నారు…
-నేడు.. సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం…
-రైతు రుణమాఫీ చేశాం.., రైతు భరోసా ఇస్తున్నాం..
-మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా విడుదల.
-రైతు సంక్షేమం కోసం పాడుపడుతున్నం.
అమ్మగారి ఇంటికి వెళ్లిన.. అమ్మవారి దర్శనం కోసం వెళ్ళిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
RTC బస్సులో జీరో టికెట్ తో ప్రయాణించిన వాళ్లు ఓటేస్తే.. BRS, BJP డిపాజిట్లు గల్లంతు..
పార్టీలకతీతంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు.
వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు.
ఆనాడు YSR హయంలో 24 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.
BRS పాలనలో వేలకోట్లతో గడిల నిర్మాణం చేశారు.. పేదలకు ఇల్లు ఇవ్వలేదు.
మా హయాంలో పేదలకు 5లక్షల ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.
వచ్చే ఏప్రిల్ ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు.
ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.
KCR నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతో.. కడుపులో విషంతో.. SLBC నీ పక్కనపెట్టారు.
అనుకోని ప్రమాదంతో SLBC ప్రమాదం జరిగితే.. మామ, అల్లుడు, కొడుకు పండగ చేసుకున్నారు.
BRS వాళ్ళు ఓట్ల కోసం ఇంటికి వస్తే.. కర్రు కాల్చి వాత పెట్టండి..
వాళ్ళు మందిని ముంచి సంపాదించిన సొమ్ము ఇస్తే తీసుకోండి. హస్తం గుర్తుకు ఓటెయ్యండి..
-స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు, పెట్రోల్ బంకులు ఇచ్చాం.
గత పదేళ్లలో అక్రమ సంపాదనే కాదు.. మొగుడు పెళ్ళాం మాట్లాడిన మాటలు విన్నోడు అసలు మనిషేనా..?.
KCR ఎవడికి జాతి పిత..? నువ్వు జాతి పిత అంటే నవ్వుతారు.
మీ ఫామ్ హౌస్ తెలంగాణ సమాజానికి ఇస్తావా..? మీ ఆస్తులు సమాజానికి ఇస్తావా..?.
-పార్టీ నష్టపోయిన.. తెలంగాణ రాష్ట్రo ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి.
మిర్యాలగూడలో నక్కజిత్తుల భాస్కర్ రావు.. జానారెడ్డి ను మోసం చేయలేదా..?.
నమ్మి టికెట్ ఇచ్చి గెలిపిస్తే.. పార్టీని వీడలేదా..?.
మా నాయకులను బెదిరిస్తే.. వొళ్ళు చింతపండు చేస్తాం…
2 ఏళ్లలో 17,400 కోట్లు ఖర్చు చేశాం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 వేల కోట్లు ఖర్చు చేశాం.
-ఎన్నికల తర్వాత.. నాగార్జునసాగర్ లో ఇళ్ల పట్టాలు ఇస్తాం…
-మట్టికి పోయిన.. ఇంటోడే ఉండాలి.
మున్సిపాలీటిల్లో కాంగ్రెస్ జెండా ఎగరెయ్యాలని పిలుపు…
సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్పుగా అభివర్ణించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలు రేషన్ కార్డుల కోసం, నాణ్యమైన బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.17 కోట్ల మందికి ప్రభుత్వం ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందజేస్తోందని గుర్తుచేశారు. “శ్రీమంతులు తినే నాణ్యమైన బియ్యాన్ని నేడు పేదవాడి పళ్ళెంలోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం” అని పేర్కొంటూ, ఈ పథకం లబ్ధిదారులు తప్పకుండా కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గూడూరులో జరిగిన ఈ సభలో ఆయన మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. సుమారు రూ. 200 కోట్లతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు శంకుస్థాపన చేసిన ఆయన, విద్యా రంగంలో పెను మార్పులు తీసుకురాబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు పారదర్శక పాలన తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతున్నందున, ఇవి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, కాబట్టి అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.